
సత్తాచాటిన సత్యవరం విద్యార్థులు
నరసన్నపేట:
సత్యవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో జరిగిన గట్కా పోటీ(యుద్ధ విద్య ) లో సత్తా చాటారు. 23 మంది విద్యార్థులు హాజరుకాగా, 8 మంది స్వర్ణ పతకాలు, 12 మందికి రజత పతకాలు, మరో ముగ్గురికి కాంస్య పథకాలు వచ్చాయని హెచ్‌ఎం వకులా రత్నమాల తెలిపారు. రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సాధించారని చెప్పారు. విజయవాడలోని ఆంధ్రా లయాలా కళాశాల్లో ఈ నెల 13, 14 తేదీల్లో ఈ పోటీలు జరిగాయన్నారు. వీరిని శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళి, ఎంఈఓ దాలినాయుడు, విద్యా కమిటీ చైర్మన్ శాంతా నాగరాజులు అభినందించారు.