
హైవే పెట్రోలింగ్ వాహనాలను తనిఖీ చేసిన ఎస్పీ
శ్రీకాకుళం క్రైమ్ : శ్రీకాకుళం నుంచి కాశీబుగ్గ జాతీయ రహదారి–16 మార్గమధ్యంలో ఉన్న హైవే పెట్రోలింగ్ వాహనాలను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. నిరంతర వాహన తనిఖీలు చేయాలని, అనుమానాస్పద వాహనాలు, మద్యం సేవించి నడిపేవారిని, నిబంధనలు ఉల్లఘించేవారిని, గంజాయి, పశువులు అక్రమ రవాణా చేసే వాహనాలను గుర్తించి ఆ పరిధి స్టేషన్ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. రోడ్డుకు ఇరువైపులా లారీలు, ఇతర భారీ వాహనాలు పార్కింగ్ లేకుండా చూడాలని, రాంగ్‌రూట్‌లో వచ్చే వాహనాలను నియంత్రించాలన్నా రు. వేకువజామున టోల్‌ప్లాజా, చెక్‌పోస్టుల వద్ద చోదకులకు ఫేష్‌వాష్ చేయించాలన్నారు.