శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు శుక్రవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు సమ్మె నోటీసు అందజేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల ని, రాజకీయ, పని ఒత్తిళ్లు తగ్గించాలని కోరారు. రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు సమ్మె నోటీసులు అందజేస్తున్నట్లు తెలిపారు. సచివాలయ వ్యవస్థ ఉద్యోగులను ద్వితీయ శ్రేణి వ్యవస్థగా మార్చి వారి ఆత్మగౌరవం దెబ్బతీస్తూ తీవ్ర ఒత్తిడికి గురి చేయడం బాధాకరమని అన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉత్తరాంధ్ర సచివాలయ ఉద్యోగుల జేఏసీ కోఆర్డినేటర్ కూన వెంకట సత్యనారాయణ, జిల్లా జీఎస్‌డబ్ల్యూఎస్ జేఏసీ నాయకులు సంజీవ్, శరత్ కుమార్, చంద్ర మౌళి, సూర్య భర త్, సాయి కుమార్ తదితరులు ఉన్నారు.
నేటి నుంచి డాక్యుమెంట్ రైటర్ల పెన్‌డౌన్
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖరులు శుక్రవారం, శనివారం పెన్‌డౌన్ నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు పెన్‌డౌన్ కార్యక్రమం నిర్వహించారు. డాక్యుమెంట్ తయారుచేసినప్పుడు మొదలుకుని అన్ని విభాగాల్లో ఓటీపీ వ్యవస్థ రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. డాక్యుమెంట్ ఫీడింగ్ చేసినప్పుడే పాన్‌కార్డు, ఆధార్‌కి వెరిఫికేషన్‌తో ఓటీపీలు వస్తున్నాయని, కొంతమంది చదువులేని వారుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీంతో అదనపు పనిభారం పెరిగిపోతోందని తెలిపారు. ప్రైమ్ 2.0 చేసినప్పుడు, వివరాలు దస్తావేజు లేఖరి నుంచి సబ్‌రిజిస్ట్రార్‌కి వెళ్తున్నాయని అయినా మళ్లీ మళ్లీ ఓటీపీలు వచ్చి ఇబ్బంది పెడుతున్నారన్నారు. స్లాట్ బుకింగ్‌లో ఏదైనా కారణం వ ల్ల హాజరు కాకుంటే యూజర్‌చార్జీ రూ.500 వృధాగా పోతోందన్నారు. కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లు కుమార్, అన్నెపు సీతారాం, పాత్రో శ్రీనివాసరావు, నల్ల శ్రీను, రాజారావు, మెహర్, గోవింద్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కొండచిలువ హల్‌చల్
కొత్తూరు: మండలంలోని మహసింగి కాలనీలో గురువారం కొండ చిలువ హల్ చల్ చేసింది. కాలనీలోని పి. సుశీల ఇంటి పెరట ఉన్న పోగుగా ఉన్న కర్రల కింద కొండ చిలువ దాగుంది. సర్పాన్ని చూసిన కాలనీ ప్రజలు భయపడ్డారు. చివరకు సర్పాన్ని పట్టుకుని హడ్డుబంగి గెడ్డలో విడిచిపెట్టారు.
అసంఘటిత కార్మికులకు చట్టపరమైన సేవలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: అసంఘటిత రంగంలోని కార్మికులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. స్థానిక న్యా య సేవా సదన్‌లో శుక్రవారం అసంఘటిత రంగ కార్మికులకు అందిస్తున్న పథకాల గురించి వివరించారు. ఈ రంగంలోని కార్మికులు సాధారణంగా చదువురానివారు, యూనియన్ లో లేనివారు కావడం వల్ల ఎక్కువగా పథకాల గురించి తెలియడం లేదని తెలిపారు.
సచివాలయం ఉద్యోగుల సమ్మె నోటీసు
సచివాలయం ఉద్యోగుల సమ్మె నోటీసు
సచివాలయం ఉద్యోగుల సమ్మె నోటీసు