
నీట్ పీజీ ఫలితాల్లో మెరిసిన విశాల్
నందిగాం: దేవళభద్ర పంచాయతీ జల్లపల్లికి చెందిన ఆరంగి విశాల్ నీట్ పీజీ ఫలితాల్లో ప్రతిభ కనబరిచాడు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో ఓబీసీ కేటగిరీలో 5136వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 296వ ర్యాంకు సాధించాడు. విశాల్ తండ్రి జానకిరామయ్య బ్యాంకు అధికారి కాగా , తల్లి సరిత గృహిణి. విశాల్ ఎంబీబీఎస్ శ్రీకాకుళం రిమ్స్‌లో పూర్తి చేశాడు. మారుమూల గ్రామానికి చెందిన విశాల్ పీజీలో ఉత్తమ ర్యాంకు సాధించడం తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
పలాస: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని శివాజీనగర్‌కు చెందిన గజపతి సందీప్ (14) అనే బాలుడు అదృశ్యమైనట్లు మేనత్త కొర్రాయి సుజాత కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సీఐ పి.సూర్యనారాయణ తెలిపారు. పాఠశాలకు సరిగా వెళ్లకపోవడంతో మందలించామని, ఆ తర్వాత ఈ నెల 14న ఒడిశా రాష్ట్రంలోని తమ స్వగ్రామమైన గజపతి జిల్లా ఒతిసింపూర్ వెళ్లిపోతానని చెప్పి వెళ్లిపోయాడని, అక్కడికి కూడా వెళ్లలేదని తెలిసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

నీట్ పీజీ ఫలితాల్లో మెరిసిన విశాల్