
● ఇంటి స్థలం విషయంలో టీడీపీ వర్గీయుల వేధింపులు ● తట్టుక
అవమాన భారం
తట్టుకోలేకే..
మా మామయ్య మొదలవలస వరహా నరసింహులు పసుపు కుంకాల కింద నా భార్యకు ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఇచ్చారు. హద్దులను వేసిన తర్వాత బండి దోవ ఉందని, ఇల్లు కట్టుకోవచ్చునని టీడీపీ నాయకుడు అన్నెపు రాము చెప్పాడు. దీంతో ఇంటిని ప్రారంభించి 50 శాతం పూర్తి చేశాం. ఆ స్థితిలో టీడీపీ కార్యకర్త అన్నెపు అసిరినాయుడు వచ్చి ఇబ్బందులు పెట్టాడు. మా ఇంటి ముందు కనిమెట్టకు చెందిన కుటుంబ సభ్యులతో కలిసి గోతులు తవ్వించాడు. దీంతో మళ్లీ అన్నెపు రాముని సంప్రదించాం. సమస్యను పరిష్కరించలేదు. వేరే పెద్ద మనుషుల సాయంతో తోవను చేసుకున్నాం. ఆ తర్వాతి రోజునే పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఇది జరిగి సుమారు రెండు నెలలు గడిచింది. వివాదాన్ని పరిష్కరించకుండా కొనసాగిస్తుండటంతో మా మామయ్య సోమవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయారు. – గురుగుబెల్లి అన్నంనాయుడు,
మృతుడి అల్లుడు, ధర్మపురం
టీడీపీ వేధింపులే కారణం
టీడీపీ నాయకుల వేధింపుల వల్లే నా తండ్రి చనిపోయారు. నేను కట్టుకున్న ఇంటికి తోవ ఇవ్వకుండా వేధించారు. జేసీబీతో గుంతలు తవ్వేశారు. అన్నెపు తులసమ్మ, శివాలు, అసిరినాయుడు, కృష్ణలు ఇంటిముందు జేసీబీతో తవ్వేశారు. పెద్దలను ఆశ్రయిస్తే తాము ఏం చేయలేమని అన్నెపు రాము చేతులెత్తేశాడు. అయితే వెనుక నుంచి మొత్తం నడిపించింది మాత్రం రామూనే.
– గురుగుబెల్లి అశ్వని, మృతుడి కుమార్తె, ధర్మపురం
తాను ఇచ్చిన స్థలంలో కూతురు ఓ ఇల్లు కట్టుకుని హాయిగా బతికితే చూడాలని ఆ తండ్రి కలలు కన్నాడు. ఇటుక ఇటుక పేర్చి ఇల్లు కడుతుంటే చూసి ఆనందపడ్డాడు. ఇరుగు పొరుగు వారు రాజకీయ కక్షలతో విషం కక్కుతుంటే అన్నింటినీ భరించాడు. కూతురు, అల్లుడు సొంత గూటిలో ఉంటే చాలని తలిచాడు. కానీ అతడికి ఆ ఆనందం మిగలలేదు. నిర్మాణం పూర్తయిన ఇంటికి దారివ్వకుండా అడ్డుకున్నారు. ఏకంగా జేసీబీలు పెట్టించి మరీ తోవను తవ్వించేశారు. ఇన్ని వేధింపులను ఆ గుండె భరించలేకపోయింది. రోజు రోజుకూ పెరుగుతున్న అరాచకాన్ని చూసి ఆ తండ్రి తట్టుకోలేక పురుగు మందు తాగి తనువు చాలించాడు. సామాన్యుడిపై రాజకీయ కక్ష మరణంతో సమానమని ధర్మపురంలో జరిగిన ఈ ఘటన మళ్లీ రుజువు చేసింది. –పొందూరు
పొందూరు మండలంలోని ధర్మపురం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త మొదలవలస వరహా నరసింహులు(55) టీడీపీ వేధింపులు తట్టుకోలేక పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కూతురు అశ్వనికి ఇచ్చిన స్థలంలో సొంతంగా ఇల్లు కట్టుకుంటే.. పక్కనే ఉన్న టీడీపీకి చెందిన వారు మాటిమాటికీ తోవ విషయమై వివాదాలు రాజేసేవారు. రెండు మూడు సార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు జరిగినా.. వారి వైఖరి మారలేదు. దీంతో ఆయన పురుగు మందు తాగి ప్రాణాలు వదిలేశాడు. రెండు నెలల కిందట ఇరు వర్గాలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చామని, స్థల వివాదం విషయంలో అన్నెపు రాము ప్రోత్సాహంతో జరిగిన వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని పొందూరు ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపారు.
జగన్ దృష్టికి తీసుకెళ్తా..
రిమ్స్‌లో వరహా నరసింహులు మృతదేహాన్ని వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయ కర్త చింతాడ రవికుమార్ పరిశీలించారు. న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి, పార్టీ పెద్దల దృష్టికి సమస్యను తీసుకెళ్తానన్నారు.

● ఇంటి స్థలం విషయంలో టీడీపీ వర్గీయుల వేధింపులు ● తట్టుక

● ఇంటి స్థలం విషయంలో టీడీపీ వర్గీయుల వేధింపులు ● తట్టుక

● ఇంటి స్థలం విషయంలో టీడీపీ వర్గీయుల వేధింపులు ● తట్టుక

● ఇంటి స్థలం విషయంలో టీడీపీ వర్గీయుల వేధింపులు ● తట్టుక

● ఇంటి స్థలం విషయంలో టీడీపీ వర్గీయుల వేధింపులు ● తట్టుక