
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు వీరే
శ్రీకాకుళం కల్చరల్/మెళియాపుట్టి/జి.సిగడాం: జిల్లాలో ముగ్గురు ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. శ్రీకాకుళం నగర పరిధిలోని గుజరాతిపేటలో అంధవరపు వరాహ నరసింహం మున్సిపల్ హైస్కూల్ హిందీపండిట్ తిమ్మరాజు నీరజ, మెళియాపుట్టి మండలం నేలబొంతు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం బూరవెల్లి విజయభారతి, జి.సిగడాం మండలం పున్నాం పంచాయతీ బూటుపేట ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం డాక్టర్ కూర్మాన అరుణకుమారిల సేవలను గుర్తిస్తూ ఈ అవార్డులను ఎంపిక చేస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.
● సులువుగా హిందీ భాష బోధించడంలో నీరజ తనవంతు కృషి చేస్తున్నారు. పాటలు, నృత్యాలు, అంత్యాక్షరి రూపంలో సృజనాత్మకంగా బోధిస్తున్నారు.
● విజయభారతి భౌతిక శాస్త్రం పుస్తకాలు రాశారు. జాతీయ స్థాయిలో ప్రత్యేక శిక్షణ పొంది విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారు.
● అరుణకుమారి వినూత్న రీతిలో విద్యాబోధన చేపడుతున్నారు. పాఠాలు సులువుగా అర్థమయ్యేలా బోధిస్తుంటారు.
వీరంతా ఈ నెల 5న అమరావతిలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డులు పొందనున్నారు. కాగా, మెళియాపుట్టి మండలం పెద్దలక్ష్మీపురం గ్రామానికి చెందిన మెట్ట మోహనరావు విశాఖ జిల్లా నుంచి ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. గోపాలపట్నం మండలం లక్ష్మీనగర్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు.
కూర్మాన
అరుణకుమారి
బూరవెల్లి
విజయభారతి
తిమ్మరాజు
నీరజ

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు వీరే

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు వీరే