
యూరియా కొరతపై 9న వైఎస్సార్‌సీపీ ఆందోళనలు
నరసన్నపేట: రైతుల కష్టాలను పట్టించుకోని కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన జిల్లాలోని పలాస, టెక్కలి డివిజన్‌లలో వైఎస్సార్‌సీపీ ఆందోళనలు చేపట్టనుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి, పార్టీ డాక్టర్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సీదిరి అప్పలరాజు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం మబగాంలో వీరు విలేకరులతో మాట్లాడారు. రైతులు యూరియా కోసం అనేక ఇ బ్బందులు పడుతున్నారని, రైతుల పక్షాన వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలి పారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు 9న పలాస, టెక్కలిలో అధికారులకు వినతి పత్రాలు ఇస్తామన్నారు. కార్యక్రమంపై చర్చించేందుకు మాజీ మంత్రి అప్పలరాజు, టెక్కలి సమన్వయకర్త పేడాడ తిలక్ మంగళవారం మబగాంకు వచ్చారు. కృష్ణదాస్ మాట్లాడుతూ గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఎరువులు, విత్తనా లు సహా అన్నీ సులభంగా లభించేవని, కానీ ఇప్పుడు యూరియా సరఫరాలో తీవ్ర లోపం కనిపిస్తోందని అన్నారు. వచ్చిన యూరియా రైతులకు ఇవ్వకుండా టీడీపీ నాయకులు పక్క దారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.
యూరియా కోసం రైతుల నిరసన
జి.సిగడాం: కూటమి ప్రభుత్వం రైతులకు సకాలంలో యూరియా సరఫరా చేయకపోవడంతో మంగళవారం సర్వేశ్వరపురం కూడలి వైఎస్సార్ విగ్రహం వద్ద రైతులు నిరసన తెలిపారు. ప్రభుత్వం తక్షణమే రైతులకు యూరియా అందించాలని వారు కోరారు.
నిలబడాల్సిందేనా..?
బూర్జ: వైకుంఠపురం గ్రామ రైతు సేవా కేంద్రానికి ప్రభుత్వం నుంచి 91 బస్తాల యూరియా వచ్చింది. మంగళవారం వైకుంఠపురంతో పాటు, కొరగాం బొడ్లపాడు, ఉప్పినివలస పరిసర గ్రామాల రైతులు యూరియా కోసం క్యూ కట్టారు.

యూరియా కొరతపై 9న వైఎస్సార్‌సీపీ ఆందోళనలు