
శ్రీకాకుళం
శుక్రవారం శ్రీ 18 శ్రీ జూలై శ్రీ 2025
ఇదేం పద్ధతి..?
టెక్కలి మేజర్ పంచాయతీలో నిధులు దోచుకోవడానికే అధికార పార్టీ కార్యకర్తలు చెప్పినట్లు అధికారులు అంచనాలను పెంచేశారంటూ వార్డు సభ్యులు మండిపడుతున్నారు. –8లో
ఈ చిత్రం చూడండి. కాశీబుగ్గలో జరిగిన ఘటన ఇది. చిన్నబడాం గ్రామంలో మంగళవారం కొత్తమ్మ తల్లి చల్లదనం ఉత్సవంలో దాడికి పాల్పడిన వ్యక్తులను, దాడికి గురైన వ్యక్తులను వదిలేసి గొడవలతో సంబంధం లేని ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. రాత్రికి రాత్రే వారిని పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చేశారు. బాధిత కుటుంబాల మహిళలు పోలీసు స్టేషన్ వద్ద సీఐ సూర్యనారాయణ కాలు మొక్కి సక్రమంగా విచారణ చేపట్టి న్యాయం చేయాలని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదే విషయమై పోలీసు స్టేషన్ ఎదుట మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ధర్నా చేశారు. కొట్లాటలో సంబంధం లేనివారిపై కేసులు
పెట్టడమేంటని ప్రశ్నించారు. గ్రామాల్లో గొడవలు సృష్టించొద్దని సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు చేతులెత్తి
నమస్కరిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.
న్యూస్‌రీల్

శ్రీకాకుళం