ఇళ్లు ఇస్తారా? డబ్బులు చెల్లిస్తారా? | - | Sakshi
Sakshi News home page

ఇళ్లు ఇస్తారా? డబ్బులు చెల్లిస్తారా?

Jul 18 2025 5:02 AM | Updated on Jul 18 2025 5:02 AM

ఇళ్లు

ఇళ్లు ఇస్తారా? డబ్బులు చెల్లిస్తారా?

శ్రీకాకుళం రూరల్‌ : అర్హులందరికీ హుద్‌హుద్‌ ఇళ్లు ఇవ్వాలని, లేదంటే తాము కట్టిన డబ్బులైనా తిరిగి ఇచ్చేయాలని డిమాండ్‌ చేస్తూ శ్రీకాకుళం రూరల్‌ మండల పరిధిలోని కుందువానిపేట గ్రామస్తులు గురువారం సర్పంచ్‌ సూరాడ సూర్యం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. 2014–19 టీడీపీ పాలనలో తెలుగుదేశం పార్టీ చెందిన మాజీ సర్పంచ్‌ సూరాడ అప్పన్న ఇళ్లు ఇప్పిస్తామంటూ సుమారు 400 మంది వద్ద నుంచి రూ.12 వేలు చొప్పున వసూలు చేసి, ఇప్పుడు రోడ్డున పడేశారంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ సూర్యం మాట్లాడుతూ కుందువానిపేటలో 288 హుద్‌హుద్‌ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. వైఎస్సార్‌ సీపీ హయాంలో తొలివిడతలో 145 ఇళ్లు ఇవ్వగా, రెండో విడతలో 72 ఇళ్లను అర్హులను గుర్తించి అందించారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ నాయకుడు సూరాడ అప్పన్న కేవలం తన కుటుంబ సభ్యులకు మాత్రమే 65 ఇళ్లు కేటాయించుకున్నారని, మిగిలిన వారికి అన్యాయం చేశారని చె ప్పారు. దీనికితోడు కొంతమందిని హౌసింగ్‌ అధికారులతో ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గ్రా మస్తులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

టీడీపీ నేతలకు వ్యతిరేకంగా కుందువానిపేట గ్రామస్తుల నిరసన

హుద్‌హుద్‌ ఇళ్లు ఇప్పిస్తానంటూ 400 మంది వద్ద డబ్బు వసూలు చేసిన మాజీ సర్పంచ్‌

బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు

మాది పేదకుటుంబం. వైఎస్సా ర్‌ సీపీ హయాంలో హుద్‌హుద్‌ ఇల్లు కేటాయించారు. ఇప్పడు హౌసింగ్‌ అధికారులతో బలవంతంగా ఖాళీ చేయించారు. ఉన్నపలంగా ఎక్కడికి పోవాలి? – బర్రి లక్ష్మీ, కుందువానిపేట

న్యాయం చేయాలి..

మాది పేదకుటుంబం. ఇల్లు, స్థలం లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మాలాంటి వారికి హుద్‌హుద్‌ ఇల్లు కేటాయించి న్యాయం చేయాలి.

– సూరాడ రోహిణి, కుందువానిపేట

డబ్బులు తీసుకున్నాడు..

టీడీపీ నాయకుడు సూరాడ అప్పన్న ఇల్లు ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నాడు. నాలా మా గ్రామంలో చాలా మంది వద్ద డబ్బులు వసూలు చేశాడు. ఇప్పుడు ఇల్లులేదు.. డబ్బులు ఇవ్వడం లేదు.

– కరుకు రాము, కుందువానిపేట

ఇళ్లు ఇస్తారా? డబ్బులు చెల్లిస్తారా? 1
1/3

ఇళ్లు ఇస్తారా? డబ్బులు చెల్లిస్తారా?

ఇళ్లు ఇస్తారా? డబ్బులు చెల్లిస్తారా? 2
2/3

ఇళ్లు ఇస్తారా? డబ్బులు చెల్లిస్తారా?

ఇళ్లు ఇస్తారా? డబ్బులు చెల్లిస్తారా? 3
3/3

ఇళ్లు ఇస్తారా? డబ్బులు చెల్లిస్తారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement