
పాతపట్నంలో ట్రాఫిక్ సమస్య
పాతపట్నం: మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పాతపట్నం సెయింట్‌ఆన్స్ పాఠశాల వద్ద గురువారం ఉదయం ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండల కేంద్రంలో 13 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలు ఉన్నాయి. ఉదయం పాఠశాలలు తెరిచేటప్పుడు, సాయంత్రం విడిచిపేట్టే సమయంలో విపరీతంగా ట్రాఫిక్ ఉంటోంది. ఇటీవల ట్రావెల్స్ బస్సులు కూడా ప్రధాన రహదారిలో ప్రయాణికులను దించేటప్పుడు ట్రాఫిక్ ఉన్నచోట నిలిపివేస్తుండడంతో ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయి. అందువలన ఇప్పటికై నా పోలీసులు స్పందించి ట్రాఫిక్ లేకుండా చూడాలని ప్రజలు, వాహనదారులు వాపోతున్నారు.