
బ్లాక్‌మార్కెట్‌కు ఎరువులు
పొందూరు రూరల్: కూటమి ప్రభుత్వం వచ్చాక ఎరువులు పక్కదారిపడుతున్నాయి. పొందూరు మండలం బాణాం రైతు సేవా కేంద్రానికి వచ్చిన సబ్సిడీ ఎరువులను గురువారం తెలుగుదేశం నాయకులు బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తుండగా మాజీ సర్పంచ్ పెద్దింటి రవిబాబు ఆధ్వర్యంలో రైతులు అడ్డుకున్నారు. లారీని అడ్డుకోవడంతో అధికార యంత్రాంగం దిగివచ్చింది. బ్లాక్ మార్కెట్‌కు వెళ్లిన ఎరువులను తిరిగి బాణాం రైతు సేవా కేంద్రానికి తరలించడంతో రైతులు నిరసన విరమించారు.
ఎరువుల దుకాణంలో విజిలెన్స్ తనిఖీలు
రణస్థలం: కోష్ఠా గ్రామంలో శ్రీ శ్రీనివాస ఎంటర్‌ప్రైజెస్ రిటైల్ ఎరువుల దుకాణంలో గురువారం విజిలెన్స్, వ్యవసాయ అధికారులు తనిఖీలు చేపట్టారు. రికార్డులు పరిశీలించారు. అదనపు గోదాములో సుమారు 126 మెట్రిక్ టన్నుల ఎరువులకు సంబంధించి లైసెన్స్ లేకపోవడంతో విక్రయాలు జరగకుండా నిలుపుదల చేశారు. వీటి విలువ రూ.20.46 లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. తనిఖీల్లో సహాయ వ్యవసాయ సంచాలకులు బి.విజయప్రసాద్, విజిలెన్స్ సీఐ అడారి సంతోష్‌కుమార్, మండల వ్యవసాయాధి కారి డి.విజయభాస్కర్, డీఏవో కార్యాలయ ఏఓ సురేష్, విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.