
జీడీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక
శ్రీకాకుళం అర్బన్: జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్(జీడీఎస్) యూనియన్, శ్రీకాకుళం డివిజన్ ద్వై వార్షిక మహాసభలు నిర్వహించారు. రాష్ట్ర నాయకులు, డివిజనల్ అధికారుల పర్యవేక్షణలో జరిగిన ఈ మహాసభలలో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న తపాలా ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. అనంతరం రెండేళ్ల కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వండాన హరిబాబు, రాష్ట్ర నాయకులు ఎం.శ్రీనివాసరావు, ఎస్.కె.జమాల్ బాషా, వై.స్పర్జన్ రాజు, మాజీ రాష్ట్ర కార్యదర్శి వై.మర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కార్యవర్గమిదే..
జీడీఎస్ అధ్యక్ష కార్యదర్శులుగా బి.అప్పారావు, ఎన్.నందికేశ్వరరావు, కోశాధికారిగా పి.రామకోటేశ్వరరావు, ఇతర కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.