
చైన్‌స్నాచర్లు అరెస్టు
మెళియాపుట్టి: పలు కేసుల్లో నిందితులైన ఇద్దరు వ్యక్తులను మెళియాపుట్టి పోలీసులు జోడూరు గ్రామం వద్ద అరెస్టు చేశారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో పాతపట్నం సీఐ రామారావు, ఎస్‌ఐ రమేష్ బాబు సోమవారం మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఇటీవల మండలంలో శేఖరాపురం గ్రామంలోని పంట పొలాల్లో నక్క శకుంతలమ్మ అనే మహిళ మెడలోని పుస్తెల తాడులో సగాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తెంపుకొని పారిపోయారు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సోమవారం ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బరంపూర్‌కు చెందిన బాలకృష్ణ సాహు, సుజీత్‌కుమార్ పాడిలు మెళియాపుట్టి వస్తుండగా గమనించిన పోలీసులు జోడూరు వద్ద అనుమానంతో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో వీరు ఇదివరకే పలు దొంగతనాల్లో అరైస్టెనట్లు గుర్తించడంతో అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో వీరు జూన్ 29వ తేదీన బరంపురంలో ద్విచక్ర వాహనాన్ని దొంగలించడంతో పాటు శేఖరాపురం గ్రామంలోని నక్క శకుంతలమ్మ పుస్తెల తాడు తెంపినట్లు వివరాలు రాబట్టారు. అలాగే 2024 జనవరిలో మండలంలోని జగన్నాథపురంలో వట్టికుల్ల రాజేశ్వరి మెడలోని తులమున్నర బంగారాన్ని సైతం అపహరించుకుపోయినట్లు తెలుసుకున్నారు. దీంతో వారు దొంగిలించిన బంగారం, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిని శ్రీకాకుళం జిల్లా జైలుకు తరలించినట్లు తెలిపారు.

చైన్‌స్నాచర్లు అరెస్టు