
దారి పొడవునా ఇసుక నిల్వలు
నరసన్నపేట: మండలంలో వంశధార నది పొడవునా ఇసుకాసురులు రాజ్యమేలుతున్నారు. ఇసుక నిల్వలు పెద్ద ఎత్తున నదీ పరిసర గ్రామాల్లో వేశారు. వర్షాకాలంలో నదిలో నీరు వస్తే అమ్మకాలు చేసుకునేందుకు వీలుగా ఎక్కడికక్కడ ఇసుక పోగులు కొన్ని వేల క్యూబిక్ మీటర్లు వేశారు. బుచ్చిపేట వద్ద అధికారికంగా డంపింగ్ యార్డు నిర్వహిస్తుండగా దాన్ని తలదన్నే విధంగా లారీ, ట్రాక్టర్ ఓన్లు కూడా ఇసుక పోగులు దాడి పొడవునా వేశారు. మడపాం నుంచి బుచ్చిపేటకు వెళ్లే మార్గంలో అడుగడుగునా ఇసుక నిల్వలు ఉన్నాయి. అలాగే లుకలాం, అంబోజీపేట, చేనులవలస, గోపాలపెంట తదితర గ్రామాల్లో కూడా ఇసుక నిల్వలు ఉన్నాయి. ఉచితంగా నది నుంచి తవ్వి అధిక ధరలకు అమ్ముకునేందుకు ఈ విధంగా పోగులు వేసినట్లు తెలుస్తోంది. బుచ్చిపేట రోడ్డుకు ఆనుకుని జీడి తోటల్లో కూడా అధికంగా నిల్వలు ఉన్నాయి. వీటిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

దారి పొడవునా ఇసుక నిల్వలు