
సమస్యలు తీర్చే వరకు గ్రామాన్ని వీడేది లేదు
సంతబొమ్మాళి: తమ సమస్యలు తీర్చే వరకు గ్రా మాన్ని విడిచివెళ్లే ప్రసక్తి లేదని మూలపేట గ్రామస్తులు టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తికి తేల్చి చెప్పారు. పోర్టు పునరావాస గ్రామమైన మూలపేట గ్రామస్తులతో మంగళవారం ఆర్డీఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నిర్వాసితులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ముందుగా భూములు ఇచ్చిన వారికి ఎకరాకు రూ.25లక్షలు చెల్లించారని, భూములు ఇవ్వనివారికి రూ. 25 లక్షలతో పాటు ఎకరాకు అదనంగా రూ. 12,50,000 లు చెల్లించారని, అందరికీ సమన్యాయం చేయాలని కోరారు. తమ గ్రామంలో కనీసం ఉపాధి పనులు కూడా కల్పించ డం లేదని వాపోయారు. పోర్టు యాజమాన్యం నిర్మించిన బ్రిడ్జిని వారే తొలగించారని, నౌపడ వెళ్లే రహదారిలో ఉన్న పాత బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో పదిమందికి పైగా గర్భిణులు ఉన్నారని, వైద్యం కోసం బయటకు వెళ్లాలంటే రహదారి అ ధ్వానంగా ఉందని తెలిపారు. సమావేశం అనంతరం ఆర్డీవో గ్రామంలో ఇంటింటా తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో తహసీల్దార్ హేమచంద్రరావు, ఎంపీడీఓ జయంత్ ప్రసాద్, టెక్కలి సీఐ శ్రీనివాసరావు, నౌపడ, సంతబొమ్మాళి ఎస్‌ఐలు నారాయణస్వామి, సింహాచలం వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
ఆర్డీవోకు తేల్చి చెప్పిన మూలపేట గ్రామస్తులు