
వైఎస్ జగన్ హయాంలో రైతుల ఇంటికే ఎరువులు..
గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఈ క్రాప్‌లో నమోదు చేసుకున్న విస్తీర్ణం మేరకు రైతుకు అవసరమైన ఎరువులు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందజేసేవారు. దీంతో రైతులందరికీ సరిపడా ఎరువులు చేరేవి. మధ్యవర్తుల జోక్యం ఉండేది కాదు. బ్లాక్ మార్కెట్, కమిషన్ల గొడవ ఉండేది కాదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితి మారింది. సీజన్‌కు ముందు ఈ–క్రాప్ నమోదు కాలేదు. రైతులకు సరిపడా ఎరువులను సరఫరా చేయడం లేదు. వచ్చిన అరకొర ఎరువులు కాస్త టీడీపీ నాయకుల చేతుల్లోకి, అజమాయిషీలోకి వెళ్లిపోయాయి. అధికారం చేతిలో ఉండటంతో వాళ్లు చెప్పిందే జరగాలని అధికారులను సతాయిస్తున్నారు. అధికారులు సైతం వంత పాడటంతో టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే ఎరువుల పంపిణీ జరుగుతున్న పరిస్థితి నెలకొంది.