
హఠాత్పరిణామమట!
అదొక
శ్రీకాకుళం క్రైమ్:
జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫరీదు పేట వైఎస్సార్ సీపీ కార్యకర్త సత్తారు గోపి హత్యోదంతంలో పోలీసులు ఊహించిన పనినే చేశారు. శనివారం ఉదయం ఈ కేసుకు సంబంధించి అసలు సూత్రధారిని తప్పించి, ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. భార్యాభర్తల తగువులో రెండు వర్గాలు జోక్యం చేసుకోవడంతో పాటు పాత కక్షలే హత్యకు ప్రధాన కారణమని తేల్చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ కేవీ రమణ (అడ్మిన్), డీఎస్పీ సీహెచ్ వివేకానంద విలేకరులకు శనివారం వివరాలు వెల్లడించారు. విలేకరులడిగిన పలు ప్రశ్నలకు ఇలా సమాధానం ఇచ్చారు.
●సీసీ ఫుటేజీ మాటేమిటి..?
సీసీ కెమెరా ఘటనా స్థలిలో చెట్టుకు ఉన్నమాట నిజమేనని, దాని డీవీఆర్ లాస్ట్‌షాపులో ఉందని, ఓనర్‌ను విచా రించామని తెలిపారు. కెమెరా పెట్టినప్పటినుంచి దానికి కనెక్షన్ ఇవ్వలేదని అందుకే డీవీఆర్ సీజ్ చేశామన్నారు.
డీవీఆర్ సీజ్ చేసి ప్రయోజనమేమిటట!
●గోపి తనపై దాడికి వస్తున్నాడనడంతోనే భవానీ ఈ నిందితులందరినీ హత్యకు పురిగొల్పిందా..
●గోపితో పాటు బైక్‌పై వస్తుంది ఒక్కరే కదా.. అడగడానికి వచ్చే వ్యక్తి ప్రత్యర్థులు ఎక్కువమంది ఉంటే ఎలా దాడి చేస్తాడు..
●హత్య ప్రణాళిక ప్రకారం జరిగిందే కదా..!
గోపి హత్య జరిగి న ప్రాంతంలోనే భవానీ తల్లి ఇల్లు ఉందని, మేడపై భవాని ఉండగానే గోపి అక్కడకు వచ్చి సామాన్లు ఎలా తెస్తావని కింద నుంచి ప్రశ్నించడంతోనే అప్పటికే గూమిగూడిన ఆమె తరఫు వారంతా మద్యం మత్తులో ఈ దాడికి పాల్పడ్డారన్నారు. అంతేకాని ప్లాన్ ప్రకారం చేయలేదని సమాధానం ఇచ్చారు.
భార్యా భర్తల తగువుకు, గోపి హత్యకు సంబంధం ఏమిటి..?
ఎస్‌ఐ కేసు కట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి..
భార్యాభర్తల తగువులో సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఇద్దరూ వినని పక్షంలోనే కేసు కట్టినట్లు పోలీసులు తెలిపారు. భర్త ఉమామహేశ్వరరావుకు కౌన్సిలింగ్‌కు రెండు మూడుసార్లు రమ్మన్నా రాలేదని, ఎస్‌ఐ నోటీసులు పంపినా రాలేదని డీఎస్పీ అన్నారు. ఉమామహేశ్వరరావు తరఫున గోపి నిలబడటం, సామాన్లు ఎలా నువ్వు తెస్తావు అని ఆమెను అడగడంతోనే ఆమె వైపున్న వీరంతా దాడి చేయడం అది హత్యకు దారితీయడం జరిగిందన్నారు.
●
పాత్ర రుజువైతే అరెస్టులు తప్పవట..
ఫరీదుపేట హత్యోదంతంలో
వివాదాస్పదంగా పోలీసుల వైఖరి
అసలు సూత్రధారుల జోలికి వెళ్లని
వైనంపై సర్వత్రా విస్మయం
అరెస్టయిన ఎనిమిది మంది టీడీపీకి చెందిన అమ్మినాయుడు అనే నాయకుడి అనుచరులని సమాచారం. అయితే దీనిపై విలేకరులు ప్రశ్నిస్తూ.. ప్రధాన వ్యక్తిని తప్పించి మిగతా వారిని అరెస్టు చేయడం కొద్ది రోజులుగా జరుగుతోందని, ఇలాగే కొనసాగితే హత్యల సంస్కృతి ఆగదని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై డీఎస్పీ వివేకానంద బదులిస్తూ.. ఎస్పీ ఆధ్వర్యంలో యాక్షన్ ప్లాన్ తప్పకుండా ఉంటుందని, దర్యాప్తు ముగియలేదని, ఇంకా నడుస్తుందని, కేసులో ఇన్వాల్వ్ అయిన ఏ ఒక్క వ్యక్తిని వదిలిపెట్టేది లేదని, మున్ముందు మీరే చూస్తారని, మిగతావారిని అరెస్టు చేయకపోతే అప్పుడు అడగండని అన్నారు. అమ్మినాయుడు, మరికొందరు అనుమానితులకు సంబంధించి సమాచారాన్నైతే సేకరించామని, విలువైన ఎవిడెన్సులు, సాక్ష్యాధారాలు సేకరించే పనిలో ఉన్నామని అన్నారు. నెలాఖరుకల్లా హత్యానేరంలో వారి పాత్ర రుజువైతే తప్పక అరెస్టులు చూపిస్తామని చెప్పారు.