
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
గార: ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి కె.హరిబాబు అన్నారు. మంగళవారం అంపోలు వద్దనున్న జిల్లా జైలును ఆయన సందర్శించి న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. సమాజంలో మంచి గుర్తింపు వచ్చేలా ప్రవర్తన ఉండాలని సూచించారు. ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. న్యాయవాదిని నియమించుకోలేని ఆర్థిక స్థోమత లేని ముద్దాయిలకు ఉచిత న్యాయవాదిని నియమించడం జరుగుతుందన్నారు. ముద్దాయిల అభ్యర్థనతో కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యం సదుపాయాలను, బ్యారెక్‌లు, లైబ్రరీ, వంట గదులను పరిశీలించారు. ఆయన వెంట ఇన్‌చార్జి సూపరిటెండెంట్ జి.మధుబాబు, జైలర్ దివాకరనాయుడు, పి.అంజనీకుమార్ సిబ్బంది పాల్గొన్నారు.