
ఆమదాలవలస మండలానికి చేరిన కిట్లు
శ్రీకాకుళం: ఆమదాలవలస మండలంలోని పాఠశాలలకు మంగళవారం కిట్లు, యూనిఫారాలు సరఫరా అయ్యాయి. ‘రాష్ట్ర అధికారులకు సమాచారం ఇవ్వరా..?’ పేరిట ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. మంగళవారం జిల్లాకు వచ్చిన యూనిఫారాల కిట్లను ఆమదాలవలస మండలానికి పంపించారు. అయితే మెగా టీచర్ పేరెంట్స్ మీటింగ్ డే నాటికి వీటిని కుట్టడం కుదరదని టీచర్లు తేల్చి చెప్పేశారు. ఇంకా ఐదు మండలాలకు కిట్లు, యూనిఫారాలు రావాల్సి ఉండడంతో ఏపీసీకి ఆ బాధ్యతలను అప్పగించారు. జిల్లాలోని చాలా పాఠశాలల్లో అదనంగా ఉన్న కిట్లు, యూనిఫారాలు సేకరించి సరఫరా కాని మండలాలకు పంపించాలని ఆదేశించారు.
విద్యాసంస్థల వద్ద నిషేధిత ఉత్పత్తులు అమ్మితే చర్యలు
శ్రీకాకుళం క్రైమ్ : విద్యాసంస్థల పరిసరాల్లో నిషేధిత గంజాయి, పొగాకు ఉత్పత్తులు క్రయవిక్రయాల జరిపితే కఠిన చర్యలు తీసుకుంటా మని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా డీజీపీ హరీష్‌గుప్తా ఆదేశాల మేరకు ఎస్పీ మంగళవారం ప్రకటన జారీ చేశారు. దీనిలో భాగంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్‌స్టేషన్లు పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది, ఈగల్ టీం, రెవెన్యూ, ఇతర శాఖల సమన్వయంతో పాఠశాలలు, కళాశాలలకు వందమీటర్ల దూ రంలో ఉన్న పాన్ కిరాణా దుకాణాల్లో సిగరె ట్లు, ఖైనీ, గుట్కా, గంజాయి తదితర ఉత్పత్తులు అమ్మరాదని, ఐదురోజుల పాటు డ్రైవ్ లో భాగంగా పోలీసుల తనిఖీలు ఉంటాయన్నారు. మొదటి దశలో తనిఖీల్లో దొరికితే జరిమానాలుంటాయని, తర్వాత దశలో కేసులు కడతామన్నారు.
కనీసం ఐదు ఇళ్లకు వెళ్లండి: కలెక్టర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ఈ నెల 10న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మెగా తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. బుధ వారం ఉదయం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కనీసం ఐదు ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులను ఈ సభకు ఆహ్వానం పలకాలని అధికారులకు ఆయన పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం జా యింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. ఇదే సమయంలో జిల్లా పర్యటనలో ఉన్న కలెక్టర్ కారులో నుంచి వీసీలో మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్‌పై ఆశయాలను ఒక పేరాలో రాసి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. ప్రతి బుధవారం నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని, ప్రతి శుక్రవారం డ్రై డే పేరుతో పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. ఉపాధి హామీ పనుల పురోగతిని సమీక్షించిన కలెక్టర్, కంపోస్ట్ గుంతలు, నీటిని చేర్చే గుంతల పనులను వేగంగా పూర్తిచేయాలని సూచించారు.
విద్యుత్ అంతరాయాలు లేకుండా చర్యలు
అరసవల్లి: జిల్లాలో అన్ని ప్రాంతాల్లోనూ అంతరాయాలు లేని నాణ్యమైన విద్యుత్ అందించే లా చర్యలు చేపట్టాలని ఈపీడీసీఎల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టి.వనజ అధికారులను ఆదేశించారు. ఈమేరకు జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఆమె జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న ఆర్డీఎస్ఎస్ పనులను పరిశీలించారు. అంతకుముందు పలు విద్యుత్ అభివృద్ధి పనులను పరిశీలించి నాణ్యతాపరంగా పలు సూచనలు చేశారు. జిల్లాలో పనుల ప్రగతిని జిల్లా సర్కిల్ ఎస్‌ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి ఆమెకు వివరించారు. అంతకుముందు ఆమె జిల్లా విద్యుత్ స్టోర్స్‌ను పరిశీలించారు. అలాగే కిల్లిపాలెంలో జరుగుతున్న ఆర్డీఎస్ఎస్ పనులను ఆమె స్వ యంగా పర్యవేక్షించారు. చిలకపాలెంలోని రెండు 33 కేవీ ఫీడర్లను పరిశీలించి మెరుగైన చర్యలకు సూచనలిచ్చారు. కార్యక్రమంలో సీజీ ఎం ప్రసాద్, ఎస్‌ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, ఆపరేషన్స్ ఈఈ పైడి యోగేశ్వరరావు, టెక్నికల్ ఈఈ సురేష్‌కుమార్, డిప్యూటీ ఈఈ వెంకటేశ్వరరావు, స్టోర్స్ ఏడీఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఆమదాలవలస మండలానికి చేరిన కిట్లు