వెన్నుపోటు చంద్రబాబు నైజం
ఉద్యమాలకు సిద్ధం..
హామీలు నెరవేర్చకుండా ఏడాది పాలన పూర్తి చేసిన కూటమి ప్రభుత్వంపై ఉద్యమాలు చేయాల్సిన సమయం వచ్చింది. అణగారిన వర్గాలకు, వెనుకబడిన కులాలకు దగా చేసిన ఈ ప్రభుత్వానికి మన సత్తా చూపెడదాం. టెక్కలి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు నేతృత్వంలో వెన్నుపోటు దినం నిర్వహించి చంద్రబాబు వెన్నులో వణుకు వచ్చేలా చేద్దాం. జూన్ 4న ఉదయం 9 గంటలకు టెక్కలి వైఎస్సార్ విగ్రహం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా కొనసాగుదాం. – పేరాడ తిలక్,
వైఎస్సార్ సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి
వైఫల్యాలను ఎండగడదాం..
ప్రజలను వంచించి, మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ అరాచక పాలన, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, హామీలు ఎగ్గొట్టిన వైనాన్ని ఎండగడుతూ ప్రజలకు నిజాలు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. శ్రీకాకుళం జిల్లా యూనిట్‌గా తీసుకొని ఒకరికి ఒకరు సహకరించుకుంటూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించనున్న వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేయాలి. ఈ కార్యక్రమంతో ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్త కార్యోన్ముఖుడు కావాలి.
– ధర్మాన కృష్ణదాస్,
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
●
టెక్కలి, నందిగాం:
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చని చంద్రబాబునాయుడుకు వెన్నుపోటు పొడవడం వెన్నతో పెట్టిన విద్య అని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు కుంభా రవిబాబు అన్నారు. ఆదివారం టెక్కలి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో కోటబొమ్మాళి మండల పార్టీ అధ్యక్షుడు సంపతిరావు హేమసుందరరాజు అధ్యక్షతన నియోజకవర్గంలోని నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అనుబంధ కమిటీ సభ్యులతో వెన్నుపోటు దినం సన్నాహక సమావేశం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసుతో కలిసి హాజరైన రవిబాబు మాట్లాడుతూ చంద్రబాబునా ఎన్నికల ముందు సూపర్‌సిక్స్ అని, అమలు కాని హామీలు ఇచ్చారని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని గుర్తు చేశారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా హామీలు అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. అయినా మళ్లీ మళ్లీ ప్రజలను మోసం చేస్తునే ఉన్నారని దుయ్యబట్టారు. వివిధ వర్గాల వారికి చేసిన మోసాలను, ప్రజలకు వెన్నుపోటు పొడిచిన వైనాన్ని వివరిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 4న టెక్కలి ఇన్‌చార్జి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నిరక్షరాస్యులకు, రైతులకు, మహిళలకు చేసిన ద్రోహానికి నిరసనగా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొనావాలని కోరారు. అనంతరం నాయకులంతా కలిసి వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరించారు.
● టెక్కలి జెడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ఎప్పుడూ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వస్తుంటారు తప్ప ప్రజలకు మేలు చేసే వ్యక్తి కాదన్నారు. తెలుగుదేశం పార్టీలో ఒక్క ఎన్టీఆర్ మాత్రమే ప్రజల కోసం ఆలోచించేవారని, అలాంటి వ్యక్తినే వెన్నుపోటు పొడిచి కుర్చీ లాక్కున్న చంద్రబాబు ప్రజలకు ఎలా మేలు చేస్తారని ప్రశ్నించారు. ఈసారి కూడా మహిళలకు ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు.
● సంతబొమ్మాళి జెడ్పీటీసీ సభ్యుడు పాల వసంతరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు చెప్పిన అబద్ధాలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారని, తీరా అధికారంలోకి వచ్చాక ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయకపోవడంతో బాబు నైజం మరోసారి బట్టబయలైందన్నారు. కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారని చెప్పారు. అప్పులు తెచ్చి అమరావతిలో పెట్టి దోచుకుంటున్నారు తప్ప ప్రజల గోడు వినిపించుకోవడం లేదని దుయ్యబట్టారు.
● కోటబొమ్మాళి జెడ్పీటీసీ సభ్యుడు దుబ్బ వెంకటరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్న వలంటీర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సీఎఫ్‌లు, వంట ఏజెన్సీ నిర్వాహకులు, రేషన్ డీలర్లు, రేషన్ పంచే వాహనదారులను అన్యాయంగా తొలగించారని మండిపడ్డారు. ఈ ఏడాదిలో ఏ వర్గానికీ మంచి జరగలేదన్నారు. వంచనతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుతీరును ఎండగొడుతూ వెన్నుపోటు దినం జరుపుకోవావల్సి బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
కూటమి ప్రభుత్వంలో
అన్ని వర్గాలకు మొండిచేయి
ఏడాది దగా పాలనకు గుర్తు
వెన్నుపోటు దినం
పోస్టర్ ఆవిష్కరణలో వైఎస్సార్ సీపీ నేతలు
వెన్నుపోటు చంద్రబాబు నైజం
వెన్నుపోటు చంద్రబాబు నైజం
వెన్నుపోటు చంద్రబాబు నైజం


