
పేద కుటుంబంపై కక్ష సాధింపు
● ఆక్రమణల పేరిట సాగుభూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు ● బాధితులు ఎదురు తిరగడంతో రంగంలోకి దిగిన పోలీసులు
క్రైం కార్నర్..
పోలాకి: మండలంలోని రాజపురం గ్రామంలో ఓ కుటుంబంపై అధికార పార్టీ కక్షసాధింపు చర్యలకు దిగింది. గ్రామానికి చెందిన అవ్వ శాంతమ్మ, గేదెల శారద తదితర కుటుంబాలు వైఎస్సార్‌సీపీకి మద్దతు పలికారనే కారణంతో అధికార పార్టీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు దిగారు. దాదాపు నలభై ఏళ్లుగా సాగులో ఉన్న పొలాన్ని చెరువు ఆక్రమణ పేరుతో రెవెన్యూ అధికారులపై ఒత్తిడికి తెచ్చి తొలగించారు. ఇటీవల అక్కడికి వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై బాధిత కుటుంబాల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇదేం అన్యాయం అంటూ తిరగబడటంతో మంగళవారం దాదాపు 30 మంది పోలీసులు, మరో పది మంది రెవెన్యూ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. తహశీల్దార్ సురేష్‌కుమార్ సమక్షంలో బాధితులకు చెందిన 38 సెంట్ల పొలాన్ని తొలగించారు. తాము అదే రెవెన్యూలో వీఆర్‌ఏలు పనిచేస్తున్న వ్యక్తుల కుటుంబాల వద్ద కొనుగోలు చేశామని, కొంత సమయం ఇవ్వాలని కోరినా అధికారులు పట్టించుకోలేదని, అధికార పార్టీ కార్యకర్తల ఆలోచనలే అమలు చేశారని బాధితులు ఆరోపించారు. ఈ విషయమై తహశీల్దార్ ఆర్.సురేష్‌కుమార్ వద్ద ప్రస్తావించగా.. గ్రామస్తుల ఫిర్యాదు మేరకే రాజపురంలో కప్పచెరువు ఆక్రమణలు తొలగించామని చెప్పారు. సర్వే నెంబర్ 26, 28లలో చెరువుతో పాటు శ్మశానానికి చెందిన 1.95 ఎకరాల్లో మొత్తం 14 మందికి చెందిన ఆక్రమణలను గుర్తించి వాటిని పూర్తిగా తొలగించామన్నారు. కచ్చితమైన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే మిగిలిన చెరువుల ఆక్రమణలను సైతం తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
వైఎస్సార్ సీపీకి ఓటు వేశామనే..
గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ఓటేశామనే అక్కసుతోనే ఇలా చేశారు. కావాలనే మాపై కొందరు టీడీపీ నాయకులు కక్ష సాధిస్తున్నారు. పెద్ద మనుషుల ముసుగులో వీరు చేస్తున్న దోపిడీలు, అక్రమాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేస్తాం.
– గేదెల శారద,
బాధిత మహిళ, రాజపురం

పేద కుటుంబంపై కక్ష సాధింపు