గార: చినవత్సవలస గ్రామంలోని రాజరాజేశ్వరి (రాజమ్మ తల్లి) సంబరాలకు భక్తులు పోటెత్తారు. ఈ ఏడాది ఏడో వారం ఉత్తరాంధ్ర కాకుండా రెండు ఉభయ రాష్ట్రాల నుంచి శనివారం సాయంత్రానికి కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు గ్రామ పరిసరాలకు చేరుకున్నారు. రాత్రి జాగరణ చేసి ఉదయం సమీప సముద్రంలో పవిత్ర స్నానాలాచరించారు. అనంతరం గ్రామంలోని రాజమ్మ తల్లి, భూలోకమ్మను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. గ్రామంలోనే వంటా వార్పు చేసుకొని సహపంక్తి భోజనాలు చేశారు. సముద్ర తీరంలో ఎస్‌ఐ హరికృష్ణ, మహాలక్ష్మి ఆధ్వర్యంలో మైరెన్ సిబ్బంది పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గార ఎస్‌ఐ ఆర్.జనార్ధన్ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పర్యవేక్షించారు.
● జయహో రాజమ్మ తల్లి