
రాష్ట్ర స్థాయి చెస్ చాంపియన్‌గా సేతుమాధవన్
రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ ఐటీ ఇండోర్ స్టేడి యంలో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు ఆదివారం నిర్వహించారు. ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 160 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీల్లో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ నువ్వా..నేనా అనే విధంగా ఏడు రౌండ్లలో క్రీడాకారులు పోటీపడ్డారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీల్లో శ్రీకాకుళంకు చెందిన ఫిడే మాస్టర్ వేలుమహంతి సేతుమాధవన్ ఆరున్నర పాయింట్లు సాధించి రాష్ట్ర స్థాయి చెస్ చాంపియన్‌గా నిలిచాడు. అలాగే విశాఖపట్నంకు చెందిన అభిరామ్ ఆరు పాయింట్లతో ద్వితీయ, విజయవాడకు చెందిన సీనియర్ క్రీడాకారుడు మల్లేశ్వరరావు తృతీయ స్థానంలో నిలిచారు. ఎస్.కోటకు చెందిన వినీల్‌కార్తీక్ నాలుగో స్థానం, విశాఖపట్నంకు చెంది న జయనాగరాజు ఐదవ స్థానంలో నిలిచారు. ఓపెన్‌లో పది మందికి, అండర్–17 విభాగంలో పది మందికి, వివిధ కేటగిరీల్లో మొత్తం 30 మంది క్రీడాకారులకు రూ.1.30 లక్షలు నగదు బహుమతి తో పాటు మెమోంటోలు, ప్రశంసా పత్రాలు జీఎంఆర్ ఐటీ తరఫున అందించారు. ఈ టోర్నమెంట్‌కు చీఫ్ ఆర్బిటార్‌గా కేవీ జ్వాలాముఖి వ్యవహరించగా ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి.అరుణ్‌కుమార్ వ్యవహ రించారు. క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముఖ్య అతిథిగా హాజరైన జీఎంఆర్ ఐటీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జె.గిరీష్, ప్రిన్సిపాల్ సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్ అన్ని ఏర్పాట్లు చేశారు.