● రిమ్స్‌లో మద్యం మత్తులో రోగి ఆత్మహత్యాయత్నం ● భవనం పైనుంచి దూకేందుకు ప్రయత్నం ● కాపాడిన సెక్యూరిటీ సిబ్బంది, కార్మికులు | - | Sakshi
Sakshi News home page

● రిమ్స్‌లో మద్యం మత్తులో రోగి ఆత్మహత్యాయత్నం ● భవనం పైనుంచి దూకేందుకు ప్రయత్నం ● కాపాడిన సెక్యూరిటీ సిబ్బంది, కార్మికులు

Mar 14 2025 1:07 AM | Updated on Mar 14 2025 1:08 AM

దగ్గరకొచ్చారో దూకేస్తా..!

శ్రీకాకుళం: మద్యం తాగేందుకు డబ్బుల కోసం ఫోన్‌ చేస్తే కుటుంబ సభ్యులు లిఫ్ట్‌ చేయకపోవడంతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రిమ్స్‌ ఆస్పత్రి భవనం మూడో అంతస్థు పైనుంచి దూకేందుకు ప్రయత్నించాడు. అయితే సకాలంలో ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది గమనించి కాపాడారు. రిమ్స్‌ సిబ్బంది, రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సరుబుజ్జిలి మండలం నక్కలపేట గ్రామానికి చెందిన సనపల వరహానర్సింహం ఆనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. మద్యం మాన్పించేందుకు కుటుంబ సభ్యులు రిమ్స్‌లో చేర్పించారు. అక్కడి ఎన్‌ఎం వార్డులో ఉండి చికిత్స పొందుతున్నాడు. గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో భవనంలోని మూడో అంతస్థుకు చేరిన వరహానర్సింహం ప్రహరీ గోడపై కూర్చున్నాడు. అతన్ని వారించగా కిందకి దూకే ప్రయత్నం చేయబోయాడు. సెక్యూరిటీ సిబ్బంది, అక్కడే పనిచేస్తున్న తాపీమేసీ్త్రలు, కార్మికులు చాకచక్యంగా పట్టుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. సిబ్బంది పట్టుకుని పైకి తీసే క్రమంలో సుమారు 20 నిమిషాల పాటు ఆ వ్యక్తి గాలిలోనే వేలాడుతూ ఉన్నాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు, వైద్యులు, స్థానికులు చెబుతున్నారు. మద్యం తాగేందుకు తన వద్ద డబ్బులు లేవని కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేస్తే వారు ఫోన్‌ లిప్ట్‌ చేయకపోవటం వల్లే తాను ఆత్మహత్యకు ప్రయత్నించానని రిమ్స్‌ అధికారులకు చెప్పాడు. కాగా, వరహా నర్సింహం ఇన్‌పేషెంట్‌ కాదని ఆస్పత్రి సూపరెండెంట్‌ డాక్టర్‌ షకీల చెపుతుండగా.. ఎన్‌ఎం వార్డులో చికిత్స పొందుతున్నారని రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

● రిమ్స్‌లో మద్యం మత్తులో రోగి  ఆత్మహత్యాయత్నం ● భవనం ప1
1/1

● రిమ్స్‌లో మద్యం మత్తులో రోగి ఆత్మహత్యాయత్నం ● భవనం ప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement