కాశీబుగ్గ: పలాస మండలం బ్రాహ్మణతర్లా గ్రామానికి చెందిన కుప్పిలి మల్లేశ్వరరావు (61) కనిపించడం లేదని కుమార్తె మామిడి గీతారాణి గురువారం కాశీబుగ్గ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరి 19న బయటకు వెళ్లి ఇంతవరకు రాలేదని, అన్నిచోట్లా వెతికినా ఆచూకీ తెలియలేదని పేర్కొన్నారు. వివరాలు తెలిస్తే 949475297 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. కాశీబుగ్గ పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సాంకేతిక అంశాలపై పట్టు అవసరం
ఎచ్చెర్ల క్యాంపస్: విద్యార్థుల్లో సాంకేతిక అంశాలపై పట్టు అవసరమని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం.విజయ్‌కుమార్ అన్నారు. ఎస్‌ఎంపురం క్యాంపస్‌లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న టెక్నికల్ ఫెస్ట్ టెక్నివేర్‌ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజ్ఞానం, వినోదం, సాంకేతిక అంశాల అవగాహన ఆధారంగా కార్యక్రమం జరుగుతుందని, 600 కళాశాలలను ఆహ్వానించామని చెప్పారు. కార్యక్రమంలో డైరెక్టర్ కొక్కిరాల వెంకటగోపాల ధన బాలాజీ, ఏవో ముని రామకృష్ణ, అకడమిక్ డీన్ కొర్ల మోహన్‌కృష్ణ చౌదరి, సెమినార్ కన్వీనర్ గేదెల రవి, సహాయ కన్వీనర్ తేజ్‌కిరణ్ పాల్గొన్నారు.
వ్యక్తి అదృశ్యం