ఎమ్మార్పీకి మించి విక్రయాలు జరుపుకోవడానికి గ్రీన్ సిగ్నల్ రావడంతో భారీగా ముడుపులు వెళ్తున్నాయి. స్థానిక, మండల, నియోజకవర్గ స్థాయి మేరకు అడ్డు తగలకుండా ఉండేందుకు కాసుల పంపకాలు చేశారు. ఈ నెలలో తొలి విడత ముడుపులు అందనున్నాయి. వ్యాపారం టర్నోవర్ చూసి ఈ ముడుపులు పెరిగే అవకాశం ఉంది. తక్కువ ధరలకు నాణ్యమైన మద్యం అందిస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దశల వారీగా తన కార్యాచరణ అమలు చేస్తోంది. ఇప్పటికే ఽఅధికారికంగా ధరలు పెంచి మద్యం బాబులకు వాత పెట్టింది. ఇప్పుడా అధికారిక ధరలకు రూ.10 పెంచి విక్రయిస్తూ మందు బాబులకు మరింత షాక్ ఇచ్చింది.