పీడీఎఫ్ తరఫున పోటీ చేసిన యూటీఎఫ్ సంఘం నాయకురాలు విజయగౌరి ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చారు. వాస్తవంగా, యూటీఎఫ్‌లో ఎమ్మెల్సీ ఓటు ఉన్న ఉపాధ్యాయులు కాస్త తక్కువే అని చెప్పాలి. ప్రాథమిక పాఠశాల స్థాయిలో వారికి బలం ఎక్కువ ఉంది. హైస్కూ ల్ స్థాయి ఉపాధ్యాయుల బలం ఆశించినంత లేదు. కాకపోతే, విజయగౌరి వ్యక్తిత్వం, పోరాట తత్వం, పీడీఎఫ్‌కున్న నమ్మకం గెలిపిస్తాయ ని ఆశించారు. సంఘాలతో సంబంధం లేకుండా ఓటేస్తారని భావించారు. 100శాతం అనుకున్నంతగా కాకపోతే చాలా మేరకు విజయగౌరికి ఓటింగ్ పడిందని చెప్పుకోవాలి. తనకొచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లును చూస్తే గట్టి పోటీ ఇచ్చారనే అనుకోవాలి.