శ్రీకాకుళం క్రైమ్ : నగరంలోని పాతబస్టాండు సమీపంలోని పందంపుళ్ల జంక్షన్ వద్ద ఆటో ఢీకొని మహిళకు గాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు గుడివీధిలో నివాసముంటున్న మలిపెద్ది శశికళ అనే మహిళ తన స్నేహితురాలు పార్వతితో కలిసి ఆదివారం పాత మార్కెట్‌కు వెళ్లింది. సామాన్లు కొని ఇంటికి వస్తుండగా పందుంపుళ్ల కూడలి వద్ద వెనుకగా వచ్చిన ఆటో శశికళను ఢీకొట్టడంతో ఆమె రోడ్డుపై పడిపోయింది. వెంటనే ఆమెను రిమ్స్‌లో చేర్పించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రసాదరావు చెప్పారు.