
పలాస మార్చురీలో కుమ్మరి సురేష్ మృతదేహం
చికెన్
బ్రాయిలర్‌లైవ్ డ్రెస్‌డ్ స్కిన్‌లెస్ శ్రీ140 శ్రీ235 శ్రీ 255
కాశీబుగ్గ: పలాస మండలం లొద్దబద్ర పంచాయతీ సున్నాడ గ్రామంలో కుమ్మరి సురేష్ (27) అనే యువకుడు మంగళవారం విద్యుత్ షాక్ తగిలి కిందపడి మృతి చెందాడు. గ్రామంలో వినాయక అన్నదాన కార్యక్రమానికి ఇంటింటికీ బియ్యం సేకరణ కోసం వాహనంపై వెళ్తుండగా వాహనానికి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో సురేష్ ఒక్కసారిగా కిందకు పడిపోయాడు. తల వెనుక భాగానికి రోడ్డు గట్టిగా తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన వారికి ఏమీ కాలేదు. ఇటుకలు తయారు చేసి జీవనం గడుపుతున్న ఆ కుటుంబానికి కుమారుడే ఆధారంగా భావిస్తున్నారు. కుమారుడి మృతి వార్త తెలిసి తల్లిదండ్రులు సింహాద్రి, అన్నపూర్ణ కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ బియ్యం పంపిణీలో వాహన చోదకుడిగా ఉన్న సురేష్ మరణించడంతో గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది.