
అరసవల్లి: హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన పెంపొందించడానికి వీలుగా జిల్లా కేంద్రంలో యూత్ ఫెస్ట్ 5కె రన్ నిర్వహిస్తున్నట్టు డీఎంహెచ్ ఓ బి.మీనాక్షి తెలిపారు. శ్రీకాకుళంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో యూత్ ఫెస్ట్ 5కె రెడ్ ఆన్ మారథాన్–2023 నిర్వహణపై శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ కలెక్టరేట్ నుంచి అరసవల్లి కూడలి వరకు శని వారం 5కె రన్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మారథాన్‌లో 17 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు గల విద్యార్థులు పాల్గొనాలని సూచించారు. మారథాన్‌లో విజేతలుగా నిలిచి వారికి నగదు బహుమతులు, ప్రోత్సాహకాలు అందజేస్తామ ని తెలిపారు. మొదటి బహుమతిగా రూ.10 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.7 వేలు, తృతీయ బహుమతిగా రూ.5 వేలు అందజేస్తున్నట్లు ప్రకటించారు. కార్యాలయ పనివేళల్లో వివరాలు నమోదు చేసుకోవాలని అన్నా రు. ఇతర సమాచారం కోసం 9494474266 సెల్ నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
డిగ్రీ మూల్యాంకనం నిధుల విడుదల
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన డిగ్రీ మూ ల్యాంకనం రుసుం నిధులు విడుదల చేసినట్లు వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు తెలిపారు. వర్సిటీ పరిపాలన కార్యాలయంలో శుక్రవారం వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది నిర్వహించిన డిగ్రీ 1, 3, 5, 6 సెమిస్టర్లకు సంబంధించి నిధులు రూ.57.78 లక్షలు విడుదల చేసినట్లు వివరించారు. శిబిరాల నిర్వహణ ఇన్‌చార్జిల ఖాతాల్లో నగదు జమ అవుతుందని అ న్నారు. శ్రీకాకుళం పట్టణంలో మహిళా ప్రభు త్వ డిగ్రీ కళాశాల, శ్రీకాకుళం రూరల్ మండలం గాయత్రీ కాలేజ్ ఆఫ్ సైన్స్, టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాజాం జీసీఎస్‌ఆర్ డిగ్రీ కళాశాలల్లో శిబిరాలు నిర్వహించినట్లు చెప్పారు.