
సీతారాంపల్లిలో పంచాయతీ సిబ్బందితో కాఫీ తాగుతున్న డీపీఓ రవికుమార్, డీఎల్‌పీఓ రమణ
పాతపట్నం: పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందితో కలిపి జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్ కాఫీ తాగారు. ‘కాఫీ విత్ క్లాప్ మిత్ర’ పేరుతో ఆయన చెత్త సేకరణ కేంద్రాల నిర్వహణపై అవగాహన కల్పిస్తూ సిబ్బందిని చైతన్యపరుస్తున్నారు. అందులో భాగంగా సీతారాంపల్లి గ్రామంలో చెత్త సంపద తయారీ కేంద్రం వద్ద పంచాయతీ సిబ్బంది, అధికారులతో కలిసి శుక్రవారం ఉదయం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్వహణపై అవగాహన కల్పించారు. పంచాయతీ సిబ్బందితో కాఫీ తాగడం ఆనందంగా ఉందని డీపీఓ అన్నారు. కార్యక్రమంలో టెక్కలి డివిజన్ పంచాయతీ అధికారి ఐవీ రమణ, ఎంపీడీఓ పి.జయంత్ ప్రసాద్, ఈవోపిర్డీ టి కృష్ణారావు,సీతారాంపల్లి సర్పంచ్ ధర్మాన కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు సవిరిగాన శ్రీనివాసరావు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.