
గిరిజన మత్స్యకారుల సమస్యలపై చర్చిస్తున్న మత్స్యశాఖాధికారులు
సారవకోట: గిరిజన మత్స్యకారుల సమస్యలపై బుడితి గ్రామంలోని సచివాలయంలో మత్స్య శాఖ అధికారులు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఇటీవల బొంతు పీహెచ్‌సీ ఆవరణలో నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో ఐటీడీఏ పీఓ కల్పనాకుమారి గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బుడి తి గ్రామానికి చెందిన గిరిజన మత్స్యకారులు వారి సమస్యలను విన్నవించారు. దీనిపై ఐటీడీఏ పీఓ సూచన మేరకు మత్స్యశాఖాధికారులు శుక్రవారం గిరిజన మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్య లు, వారికి చేపల వేటకు కావాల్సిన వస్తువులు, అలాగే పట్టిన చేపలు విక్రయించుకునేందుకు కావాల్సిన వస్తువులపై సమావేశం నిర్వహించారు. దీని పై పూర్తిస్థాయి నివేదిక తయారు చేసి ఐటీడీఏ పీఓకు అందజేయనున్నట్లు మత్స్య శాఖ జేడీ పీవీ సత్యనారాయణ తెలిపారు. ఆయనతో పాటు పలా స, శ్రీకాకుళం డివిజన్ల ఏడీలు వై.సత్యనారాయణ, టి.సంతోష్, ఎఫ్‌డీఓ సురేష్ కుమార్, సారవకోట ఫిషరీస్ అసిస్టెంట్ వెంకటేష్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నక్క తులసీదాస్, నిక్కు రాజశేఖర్ తదితరులు ఉన్నారు.