
విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న దృశ్యం
శ్రీకాకుళం అర్బన్: వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లాలో అందుబాటులో ఉన్న 12 డిప్లొమో, ట్రైనింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలోని సమావేశ మందిరంలోని డీఎంహెచ్‌ఓ బొడ్డేపల్లి మీనాక్షి నేతృత్వంలో అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎన్.అనూరాధ ఆధ్వర్యంలో 491 మంది విద్యార్థులు వివిధ డిప్లొమో, ట్రైనింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందారు. డీఎంఎల్‌టీ, డీఎంఐటీ, డీఓవో, డీడీఐఏఎల్‌వై, డీఎంఎస్‌టీ, డీవోఎం, డీఆర్‌జీఏ, డీసీఏఆర్‌డీఐవో, డీసీఎల్‌టీ, డీఈసీజీ, డీఏఎన్‌ఎస్, డీఎంపీహెచ్‌ఏ(ఎం) కోర్సుల్లో ప్రవేశాలు పొందారు. ఈ కౌన్సెలింగ్ ప్రక్రి యలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఏఓ, మాస్‌మీడియా అధికారి పైడి వెంకటరమణ, సూపరింటెండెంట్ భాస్కరకుమార్, దాసు, ప్రసాద్, సంతోష్, విజయ సుందరీమణి, 12 కళాశాలల ప్రిన్సిపాళ్లు, సిబ్బంది పాల్గొన్నారు.