
విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డీఈఓ
టెక్కలి: టెక్కలి ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఎం.సరిత రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం ఎన్.శోభారాణి, పీడీలు డి.సూర్యకాంతం, బి.ఆదిశేషు గురువారం తెలిపారు. ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి హాకీ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. విద్యార్థినిని పాఠశాల సిబ్బంది అభినందించారు.
‘అకడమిక్ క్యాలెండర్ అమలు చేయాల్సిందే’
ఎచ్చెర్ల క్యాంపస్: పక్కాగా అకడమిక్ క్యాలెండర్ అమలు చేయాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు అన్నారు. వర్సిటీ పాలక మండలి సమావేశ హాల్‌లో అకడమిక్, పరిపాలన అంశాలపై అధికారులతో ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. ఆర్ట్స్, సైన్స్, ఇంజినీరింగ్, లా, కామర్స్ అన్ని కోర్సుల్లో సెమిస్టర్ యూనిట్‌గా క్లాస్ వర్క్ పక్కాగా జరగాలని అన్నారు. మిడ్ సెమిస్టర్లు, ప్రయోగ పరీక్షలు, సెమిస్టర్ ఎండ్ పరీక్షలు షెడ్యూల్ మేరకు జరగాలని అన్నారు. 90 రో జుల పాటు అకడమిక్ క్యాలెండర్ మేరకు పరీ క్షలు జరగాలని చెప్పారు. విద్యార్థుల హాజరు మెరుగ్గా ఉండేలా విభాగాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. వర్క్‌లోడ్‌కు అనుగునంగా టైమ్ టేబుల్ ప్రతి విభాగం సిద్ధం చేసుకోవాలని చెప్పారు. సిలబస్‌లో వచ్చిన మార్పులపై దృష్టి పెట్టాలని చెప్పారు. కార్యక్రమంలో రిజస్ట్రార్ ప్రొఫెసర్ సీహెచ్‌ఏ రాజేంద్రప్రసాద్, ప్రిన్సిపాళ్లు ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య, డాక్టర్ ఎస్.ఉదయ్‌భాస్కర్, ప్రొఫెసర్ చింతాడ రాజశేఖర్‌రావు, సీడీసీ డీన్ ప్రొఫెసర్ పీలా సుజాత పాల్గొన్నారు.
‘హిందీ భాషాభివృద్ధికి
కృషి చేయాలి’
కోటబొమ్మాళి: ప్రతి పాఠశాలలో హిందీ భాషాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా అన్నారు. ఆయన గురువారం కోటబొమ్మాళి జిల్లాపరిషత్ బాలుర హైస్కూల్‌లో జరిగిన హిందీ దివస్ కార్యక్రమంలో డీఈఓ ఎన్.వెంకటేశ్వరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ భాషగా ఉన్న హిందీని విద్యార్థులంతా తప్పనిసరిగా నేర్చుకోవాలని, అలాగే ఆ భాషలో మాట్లాడే విధంగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని సూ చించారు. డీఈఓ వెంకటేశ్వరావు మాట్లాడు తూ హిందీ చదవడం, రాయడం, మాట్లాడడం నేర్చుకోవాలన్నారు. జిల్లా ఎన్‌సీసీ కమాండర్ అమిత్ బెనర్జీ మాట్లాడుతూ హిందీ భాష ప్రా ముఖ్యతను వివరించారు. కోటబొమ్మాళి హై స్కూల్‌లో ఎన్‌ిసీసీ శిక్షణ కేంద్రం మంజూరుకు కృషి చేస్తానని అమిత్ బెనర్జీ ప్రకటించారు. హిందీ దివస్ బాగా నిర్వహించడంపై హెచ్‌ఎం డబ్బీరు గోవిందరావును అందరూ అభినందించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఆకట్టుకున్న సాహితీ ప్రసంగం
శ్రీకాకుళం కల్చరల్: స్థానిక ఉపనిషన్మందిరంలో ఉపనిషన్మందిరం, మహతి సంయుక్త నిర్వహణలో జరుగుతున్న సాహిత్య గణపతి ఉపన్యాసాలలో భాగంగా బుధవారం ‘చంద్రుని కంతయై’ అంశంపై ప్రసంగం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు పండితుడు ఆర్.బాబూరావు మాట్లాడుతూ వామనుడి జననంతో కలిగిన ఫలితాలను వివరించారు. కార్యక్రమంలో మందుల మోహనరావు, ఐ.టి.కుమార్, తవుడు, పులఖండం శ్రీనివాసరావు, సాయిప్రసాద్, సనపల నారాయణమూర్తి పాల్గొన్నారు.

నిమ్మ వెంకటరావు

ప్రసంగిస్తున్న బాబూరావు