
పోర్టును పరిశీలిస్తున్న సబ్ కలెక్టర్ నూరుల్‌కమార్
సంతబొమ్మాళి: టెక్కలి సబ్ కలెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన నూరుల్ కమార్ బుధవారం మూలపేట పోర్టును పరిశీలించారు. పనుల స్థాయిని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు విశ్వసముద్ర జీఎం శంకర్, తహసీల్దార్ చలమయ్య తదితరులు ఉన్నారు.
మిస్సింగ్ కేసులపై దృష్టి పెట్టాలి
సోంపేట: పోలీస్‌స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎస్పీ జి.ఆర్.రాధిక సిబ్బందికి సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బారువ పోలీస్ స్టేషన్‌ను బుధవారం సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తు వెంటనే పూర్తి చేయాలన్నారు. మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కాశీబుగ్గ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, సీఐ రవిప్రసాద్, ఎస్‌ఐ చిరంజీవి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
త్వరితగతిన చార్జిషీట్ ఫైల్‌చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జైలులో ఉన్న ముద్దాయిల కేసుల విషయంలో పోలీసులు త్వరితగతిన చారిషీట్ ఫైల్ చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. బుధవారం జిల్లా కోర్టులో అండర్ ట్రయల్ ప్రిజనర్స్ రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యమివ్వాలన్నారు. సమావేశంలో అదనపు న్యాయమూర్తులు శ్రీదేవి, ఫణికుమార్, భాస్కరరావు, సీనియర్ సివిల్ జడ్జి, డీఎల్‌ఎస్‌ఏ ఇన్‌చార్జి కార్యదర్శి అనురాధ, అడిషనల్ ఎస్పీ విఠలేశ్వరరావు, డీఆర్‌ఓ ఎం.గణపతిరావు, జిల్లా జైలు సూపరింటెండెంట్ నబీ ఖాన్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మెట్ట మల్లేశ్వరరావు, పాలకొండ ఎస్‌డీపీఓ జి.వి.కృష్ణారావు, ఎస్‌ఈబీ ఆఫీసర్ మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా

బారువ పోలీస్‌స్టేషన్‌లో రికార్డులు పరిశీలిస్తున్న ఎస్పీ రాధిక