
వీసీ వెంకటరావును సన్మానిస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది
ఎచ్చెర్ల క్యాంపస్: వర్సిటీలో సిబ్బంది సంక్షేమమే లక్ష్యమని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు అన్నారు. బోధనేతర సిబ్బంది వేతనాల పెంపుపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం వీసీ, వర్సిటీ అధికారులకు సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధనేతర సిబ్బందిని మూడు కేటగిరీలుగా విభజించి వేతనాలు పెంచినట్లు చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీ వేశామన్నారు. అందరూ సమష్టిగా పనిచేస్తేనే ప్రగతి సాధ్యమవుతుందన్నారు. 113 మందికి విద్యార్హత, ప్రస్తుతం పోస్టుల ఆధారంగా విభజించి వేతనాలు అమలు చేసినట్లు చెప్పారు. గతంలో సబ్జెక్టు కాంట్రాక్టులకు సైతం మెరుగైన వేతనాలు అమలు చేసినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ సీహెచ్‌ఏ రాజేంద్ర ప్రసాద్, ప్రిన్సిపాళ్లు బిడ్డిక అడ్డయ్య, ఎస్.ఉదయ్‌భాస్కర్, సీహెచ్ రాజశేఖర్‌రావు, పాలక మండలి సభ్యురాలు ప్రొఫెసర్ పీలా సుజాత తదితరులు పాల్గొన్నారు.