
పింఛన్ నగదు అందిస్తున్న దృశ్యం
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన పాలక కుమారి(తల్లి), పాలక చిన్ని(కుమారుడు), బొచ్చా లావణ్య(మేనకోడలు) సికిల్‌సెల్ అనీమియా వ్యాధి బారిన పడ్డారు. వీరికి ప్రభుత్వం రూ.10 వేలు చొప్పున పింఛన్ మంజూరు చేయడంతో మొత్తం రూ.30 వేల నగదును శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బొనెల చంద్రమ్మ, వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి బోనెల రాము, వెల్ఫేర్ సెక్రటరీ వైకుంఠరావు, బోనెల గణపతి, మిన్ను, గృహ సారథులు జగన్, స్వాతి, వలంటీర్ చైతన్య పాల్గొన్నారు.