
శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ డెస్క్
ఆమదాలవలస: ఒడిశాలో రైలు ప్రమాదం నేపథ్యంలో హెల్ప్‌లైన్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ మేనేజర్ ఎం.రవికుమార్ తెలిపారు. శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్‌లో స్టాపేజ్ లేకపోవడంతో పూర్తిస్థాయి స్పష్టత రావడం లేదని, జిల్లాకు చెందిన ప్రయాణికులు కొన్నిసార్లు ఒడిశా రాష్ట్రం బరంపూర్‌లో దిగి జిల్లాకు వస్తుంటారని, మరికొందరు విశాఖపట్నంలో దిగి జిల్లాకు వస్తుంటారని చెప్పారు. ఈ నేపథ్యంలో పలాస, శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్‌లలో హెల్ప్‌లైన్ డెస్కులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాకు సంబంధించి ఎవరైనా ఉంటే వెంటనే హెల్ప్‌లైన్ నంబర్లు 85911 85912, 85913 85914, బీఎస్‌ఎన్‌ఎల్ నెంబర్లు 08942 286213, 08942 286245కు సమాచారం అందించాలని కోరారు.