రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోతే అనంతపురం జిల్లా ఎడారి ప్రాంతంగా మారడం ఖాయం. ప్రజలందరూ ఉద్యమ బాట పట్టాలి. రైతులకు అండగా నిలిచేది ఒక్క వైఎస్ కుటుంబమే. చంద్రబాబు వ్యవసాయం దండగ అని ఎప్పుడూ అనేవారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్, ఇన్‌పుట్ సబ్సిడీ తీసుకొచ్చారు. సాగునీటి రంగానికి రూ.లక్ష కోట్లను బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఘనత వైఎస్సార్‌దే. హంద్రీ–నీవా పూర్తి చేయించి రాయలసీమకు నీళ్లు తెచ్చారు. పోలవరం వైఎస్ చొరవే. ఇప్పుడు సీమకు అన్యాయం జరుగుతుంటే రాష్ట్ర మంత్రులు విదేశీ పర్యటనలో జల్సాలు చేస్తుండటం సిగ్గుచేటు. – కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే


