కదిరి అర్బన్: మండలంలోని యర్రదొడ్డి గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉగాది అనంతరం తొలి ఆదివారం కావడంతో పెద్దఎత్తున భక్తులు గంగమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి తమ మొక్కులను సమర్పించుకున్నారు. రాత్రి అమ్మవారికి గ్రామెత్సవం నిర్వహించారు.
బత్తలపల్లి: మండల కేంద్రంలోని గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు అమ్మవారిని పూలు, నిమ్మ, వేప, ఆకులతో అలంకరించారు. భక్తులు అమ్మవారికి బోనం నైవేద్యంగా సమర్పించారు. అనంతరం అమ్మవారికి జంతుబలులు ఇచ్చారు. అలాగే మండల వ్యాప్తంగా ప్రజలు జంతుబలులిచ్చి, పంటలు పుష్కలంగా పండాలని గ్రామదేవతలను వేడుకున్నారు. అనంతరం ఆయా గ్రామాల్లో టెంకాయలు, చీనీపండ్లు విసురుతూ యువకులు పందేలు ఆడారు.


