ఆర్డీటీ ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్డీటీ ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్‌ చేయాలి

Mar 23 2026 7:06 AM | Updated on Mar 23 2026 7:06 AM

అనంతపురం: కరువు సీమలో కల్పతరువుగా విరాజిల్లుతున్న ఆర్డీటీని పరిరక్షించాలన్న డిమాండ్‌తో ఏప్రిల్‌ 9న సీపీఐ ఉమ్మడి అనంతపురం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ , సీపీఎం మద్దతు ఇవ్వాలని సీపీఐ కోరింది. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డితో పాటు సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప, నగర కార్యదర్శి రామిరెడ్డి, బాలరంగయ్యలను సీపీఐ జిల్లా బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్‌ మాట్లాడుతూ.. ఆర్డీటీ ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్‌ చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందన్నారు. ఎన్నో ఆందోళనలు, నిరసనలు చేపట్టినా ఫలితం లేకపోయిందన్నారు. ఆదివారం వైఎస్సార్‌సీపీ, సీపీఎం నాయకులను మాత్రమే కలిశామని, తక్కిన రాజకీయ, కుల సంఘాలను కలిసి బంద్‌ను విజయవంతం చేయాలని కోరతామన్నారు. ఏప్రిల్‌ 3న అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి, భవిష్యత్‌ కార్యాచరణకు శ్రీకారం చుడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పాల్యం నారాయణస్వామి, సహాయ కార్యదర్శి మల్లికార్జున, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీరాములు, కేశవ రెడ్డి, రామకృష్ణ, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్లాయిస్వామి , నరేష్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నాగరాజు, సీపీఐ జిల్లా సమితి సభ్యులు అల్లిపీర, ఏఐవైఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

ఏప్రిల్‌ 9న ఉమ్మడి జిల్లాల బంద్‌కు సీపీఐ పిలుపు

వైఎస్సార్‌సీపీ, సీపీఎం మద్దతు కోరిన సీపీఐ నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement