క్రమబద్ధీకరణ లేకుండా బదిలీలు చేయండి | - | Sakshi
Sakshi News home page

క్రమబద్ధీకరణ లేకుండా బదిలీలు చేయండి

Mar 23 2026 7:06 AM | Updated on Mar 23 2026 7:06 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో క్రమబద్దీకరణ చేయకుండా టీచర్ల బదిలీలు మాత్రమే చేపట్టాలని వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. ఆదివారం స్థానిక ఉపాధ్యాయ భవనంలో వైఎస్సార్‌టీఏ జిల్లా సబ్‌ కమిటీ అత్యవసర సమావేశం జరిగింది. క్రమబద్ధీకరణ జరిగి ఒక సంవత్సరం కూడా కాలేదని, ఒక విద్యా సంవత్సరంలో పాఠశాలల రోల్‌ పెరగడం అనేది అసాధ్యమని, ఫలితంగా చాలా పాఠశాలలు మూతపడే అవకాశం ఉందని నాయకులు తెలిపారు. అలాగే గత సంవత్సరంలో బదిలీ అయిన ఉపాధ్యాయులు ఇప్పుడు కూడా క్రమబద్ధీకరణకు గురైతే తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు. ఈ పరిస్థితుల్లో కేవలం టీచర్ల బదిలీలు మాత్రమే నిర్వహించాలని, క్రమబద్ధీకరణ చేయకూడదని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌టీఏ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.నాగిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అసోసియేషన్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడు గోపాల్‌, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.గోవిందరెడ్డి, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ రాధాకృష్ణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరమణప్ప, రవీంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరెడ్డి, ఓబిరెడ్డి, సిద్ధప్రసాద్‌ జిల్లా కార్యదర్శి కృష్ణా నాయక్‌, విశ్వనాథరెడ్డి, రామకృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement