పుట్టపర్తి టౌన్: ఈద్ –ఉల్ –ఫితర్ (రంజాన్) సందర్భంగా జిల్లాలో శనివారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈద్గాలు, మసీదుల్లో ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు అలింగనం చేసుకొని ఈద్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పెద్దలు, తల్లిదండ్రులు పట్ల విధేయత చూపాలని, మత సామరస్యం, సోదరభావం, సౌభ్రాతృత్వం పెంపొందించుకోవాలని మత పెద్దలు సందేశం ఇచ్చారు. మత సామరస్యాన్ని చాటుతూ ఇచ్చిన విందుల్లో హిందువులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు మస్లింలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గాలు, మసీదుల వద్ద పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా డ్రోన్ల ద్వారా నిఘా ఉంచారు.
భక్తిశ్రద్ధలతో రంజాన్ ప్రార్థనలు
కిటకిటలాడిన మసీదులు, ఈద్గాలు


