విద్యార్థిని బలిగొన్న ఈత సరదా | - | Sakshi
Sakshi News home page

విద్యార్థిని బలిగొన్న ఈత సరదా

Mar 22 2026 2:04 AM | Updated on Mar 22 2026 2:04 AM

వజ్రకరూరు: ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణాలు బలిగొంది. వజ్రకరూరు మండలం పీసీపీ కొత్తకోట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.గ్రామానికి చెందిన చిన్న మాదుల రాజేష్‌, సోమావతి దంపతులకు ముగ్గురు కుమారులు కాగా, వీరి చిన్న కుమారుడు అరుణ్‌తేజ్‌ (13) స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. శనివారం పాఠశాలకు సెలవు కావడంతో అరుణ్‌తేజ్‌ మరో నలుగురు విద్యార్థులతో పాటు తన కుటుంబసభ్యులతో కలిసి గ్రామానికి సమీపంలోని ఉన్న సొంత పొలానికి వెళ్లాడు. కాసేపు ఆడుకున్న తర్వాత స్నేహితులతో కలిసి బావిలో ఈత కొడుతూ నీటి అడుగు భాగానికి వెళ్లిన అరుణ్‌తేజ్‌ ఎంత సేపటికీ పైకి రాలేదు. కంగారు పడిన స్నేహితుల కేకలు విన్న కుటుంబసభ్యులు వెంటనే అక్కడకు చేరుకుని బావిలో దూకి గాలింపు చేపట్టారు. నీటి అడుగున పూడికలో ఇరుక్కుపోయిన అరుణ్‌తేజ్‌ను వెలికి తీసి ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అరుణ్‌తేజ్‌ మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న జెడ్పీ హెచ్‌ఎస్‌ హెచ్‌ఎం రాజ్‌కుమార్‌, ఉపాధ్యాయులు ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. విద్యార్థి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement