కర్రసాము పోటీలు | - | Sakshi
Sakshi News home page

కర్రసాము పోటీలు

Mar 20 2026 7:52 AM | Updated on Mar 20 2026 7:52 AM

గార్లదిన్నె: ఉగాది పండుగ సందర్భంగా మండలంలోని పాత కల్లూరులో కర్రసాము, ఇరుసు పైకి ఎత్తే పోటీలు నిర్వహించారు. ఏటా గ్రామంలో యువకులకు గ్రామీణ క్రీడల పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం కర్రసాము, ఇరుసు ఎత్తే పోటీలు నిర్వహించారు. కర్రసాము పోటీల్లో ఆరుగురు పాల్గొనగా వారిలో వెంకటనరసింహ, శ్రీకర్‌ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలవగా వారికి రూ.4 వేలు, రూ.3 వేల నగదు బహుమతి అందజేశారు. ఇరుసు పైకెత్తే పోటీల్లో ఆరుగురు పాల్గొనగా ఉప్పరపల్లి నారాయణ, నాగిరెడ్డిపల్లి రామానంద ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. వారికి రూ.6వేలు, రూ.3 వేల నగదు బహుమతి అంద జేశారు. జనం అధిక సంఖ్యలో తరలివచ్చి పోటీలను తిలకించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement