పుట్టపర్తి టౌన్: స్థానిక శిల్పారామంలో ఉగాది సంబరాలు వైభవంగా సాగాయి. శిల్పారామం ఏఓ ఖాదర్‌వలి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం పురోహితుడు నాగరాజుశర్మ పంచాంగం చదివి వినిపించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు. స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో శిల్పారామంలో సందడి నెలకొంది.
గుండెపోటుతో
ఏఆర్ ఎస్‌ఐ మృతి
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ ఎస్‌ఐగా పనిచేస్తున్న మహేశ్వరరెడ్డి బుధవారం గుండె పోటుతో మృతి చెందారు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలానికి చెందిన ఆయన 1990లో ఏఆర్ విభాగంలో చేరారు. బుధవారం రాత్రి గుండెపోటుకు గురై కోలుకోలేక మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్పీ సతీష్‌కుమార్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంత్యక్రియల నిమిత్తం వారి కుటుంబసభ్యులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. గురువారం అనంతపురంలోని రుద్రంపేట బైపాస్ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆర్‌ఐ వలి, పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు సూర్యకుమార్, అడహక్ కమిటీ సభ్యుడు త్రిలోక్‌నాథ్, సిబ్బంది షౌకత్ అలీ తదితరులు పాల్గొన్నారు.


