ఆకట్టుకున్న ‘ఆనందం తవ దర్శనం’ | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న ‘ఆనందం తవ దర్శనం’

Mar 19 2026 10:24 AM | Updated on Mar 19 2026 10:24 AM

ప్రశాంతి నిలయం: ఆంధ్రప్రదేశ్‌ సత్యసాయి సేవాదళ్‌ ఆధ్వర్యంలో బుధవారం సాయికుల్వంత్‌ సభా మందిరంలో నిర్వహించిన సంగీత కచేరీ ఆకట్టుకుంది. ‘ఆనందం తవ దర్శనం’ పేరుతో బుధవారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సత్యసాయిని స్తుతిస్తూ పలు భక్తి గీతాలను ఆలపించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌ సత్యసాయి సేవాదళ్‌ అధ్యక్షుడు లక్ష్మణరావు ప్రసగించారు. సత్యసాయి సేవలను కొనియాడారు.

పట్టపగలే చోరీ

కనగానపల్లి: మండల కేంద్రం చెన్నేకొత్తపల్లిలోని ఓ ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. చెన్నేకొత్తపల్లికి చెందిన ఆదినారాయణరెడ్డి చిరు వ్యాపారాలతో జీవనం సాగిస్తున్నాడు. కొంత కాలం క్రితం భార్య చనిపోయింది. కుమారుడు, కుమార్తె మరో ప్రాంతంలో చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒంటరిగా ఉన్న ఆదినారాయణరెడ్డి బుధవారం ఉదయం ఇంటికి తాళం వేసి పనిపై బయటకు వెళ్లాడు. సాయంత్రం 4 గంటలకు తిరిగి వచ్చాడు. అప్పటికే తలుపులు తీసి ఉండడం గమనించి లోపలకు వెళ్లి పరిశీలించారు. 30 తులాల బంగారు, రూ.1.05 లక్షల నగదు కనిపించకపోడంతో చోరీ జరిగినట్లుగా నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో సీకే పల్లి పీఎస్‌ ఎస్‌ఐ సత్యనారాయణ, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement