హిందూపురం: గ్యాస్ సిలిండర్ల కొరతతో హిందూపురం పట్టణంలోని రైల్వేరోడ్డులోని హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు బారులు తీరుతున్నారు. పాసుపుస్తకాలతో ఏజెన్సీ వద్దకు వస్తున్నారు. దీంతో బుధవారం గ్యాస్ ఏజెన్సీ కార్యాలయం కిటకిటలాడింది. సిలిండర్లు బుక్ చేసినా డిలివరీ కావడం లేదని వాగ్వాదానికి దిగారు. ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం 7, 8 తేదీల్లో బుక్ చేసిన వారికి వరుస క్రమంలో సిలిండర్లు ఇస్తున్నామని చెబుతున్నారు. ఇక హిందూపురం మండలంలోని వివిధ గ్రామాల్లోని రోడ్లపై ఎక్కడ చూసినా ఖాళీ గ్యాస్ సిలిండర్లే కనిపిస్తున్నాయి. గ్యాస్ బండి రాగానే సిలిండర్ల కోసం ఎగబకే పరిస్థితి ఏర్పడుతోంది.


