జీవితాల్లో ఉషస్సులు వెల్లివిరియాలి | - | Sakshi
Sakshi News home page

జీవితాల్లో ఉషస్సులు వెల్లివిరియాలి

Mar 19 2026 7:32 AM | Updated on Mar 19 2026 7:32 AM

జిల్లా ప్రజలకు ఉషశ్రీచరణ్‌ ఉగాది శుభాకాంక్షలు

పెనుకొండ రూరల్‌: ఈ ఉగాది అందరి జీవితాల్లో ఉషస్సులు నింపాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్‌ ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు, అధికారులకు, వైఎస్సార్‌ సీపీ శ్రేణులకు పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పచ్చడిలో తీపి, చేదు, కారం, పులుపు, ఉప్పు, వగరు ఉన్నట్లే...జీవితంలోనూ మంచి, చెడు, కష్టాలు, సుఖాలు ఉంటాయని, వాటన్నింటినీ ఒకేలా తీసుకుంటూ ముందుకు సాగాలన్నారు.

ప్రజలకు ఎస్పీ శుభాకాంక్షలు

పుట్టపర్తి టౌన్‌: జిల్లా ప్రజలకు, పోలీస్‌ సిబ్బందికి ఎస్పీ సతీష్‌కుమార్‌ ఉగాది, రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు సంవత్సరాది ఉగాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఉగాది వేడుకలు అందరూ ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. అలాగే రంజాన్‌ను ముస్లింలంతా సంతోషంగా జరుపుకోవాలన్నారు.

ఎలుగుబంటి కలకలం

గుడిబండ: మండల పరిధిలోని ఎస్‌ రాయపురం గ్రామంలో ఓ ఎలుగుబంటి కలకలం రేపింది. బుధవారం ఉదయం గ్రామంలో అటుఇటూ తిరుగుతూ హల్‌చల్‌ చేసింది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. పొలాల్లోకి వస్తున్న ఎలుగుబంట్లు పంటల మధ్య దాక్కుని రైతులపై దాడులు చేస్తున్నాయని వాపోయారు. పంటలను కూడా నాశనం చేస్తున్నాయన్నారు. అటవీ శాఖ అధికారులు వన్య ప్రాణుల నుంచి రైతులను కాపాడాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement