విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు

Mar 18 2026 7:43 AM | Updated on Mar 18 2026 7:43 AM

హిందూపురం: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మాతా శిశు మరణాలు పునరావృతం కాకూడదని, విధులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ ఫైరోజ్‌బేగం, డీసీహెచ్‌ మధుసూదన్‌ హెచ్చరించారు. ‘తల్లీబిడ్డను చంపేశారు’ శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. హిందూపురం ఆస్పత్రిలో కొటిపికి చెందిన బాలింత అనూరాధమ్మ, శిశువు మృతి ఘటనపై వారు వైద్యులు, సిబ్బందితో విచారణ చేపట్టారు. మృతురాలు తీసుకున్న వైద్యం, క్షేత్రస్థాయిలో అందించిన సేవలు తదితర వాటిపై వివరాలు సేకరించారు. మృతురాలు ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి జరిగిన పరిణామాలను గైనికాలాజిస్ట్‌ బాబా బుడెన్‌తో అడిగి తెలుసుకున్నారు. ఘటనపై పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. అనంతరం ఆస్పత్రిలోని కాన్ఫరెన్స్‌హాల్‌లో వైద్యులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ క్షేత్రస్థాయి సిబ్బంది హైరిస్క్‌ గర్భిణులు సుఖ ప్రసవం అయ్యేవరకు నిరంతరం గమనిస్తూనే ఉండాలన్నారు. తల్లీబిడ్డల ప్రాణాలు చాలా అమూల్యమైనవన్న విషయాన్ని మరువకూడదన్నారు. సకాలంలో స్పందిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు రావన్నారు. సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజగోపాల్‌, డాక్టర్‌ జనార్దన్‌, డీపీహెచ్‌ఎన్‌ఓ వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.

180 మంది గైర్హాజరు

పుట్టపర్తి: జిల్లాలో ఇంటర్‌ పరీక్షలు సజావుగా జరుగుతున్నాయి. మంగళవారం జరిగిన ఇంటర్‌ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ పరీక్షకు 180 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ చెన్నకేశవప్రసాద్‌ తెలిపారు. జిల్లాలోని 41 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాశారు. 6,575 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 6,385 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. మొత్తం 180 మంది గైర్హాజరైనట్లు వివరించారు. ఇంటర్‌ పరీక్షల రాష్ట్ర పరిశీలకులు సౌజన్య హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరులో పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. విద్యాశాఖ అధికారులు, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌ సభ్యులు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.

అనుమతులు తీసుకోకుండా బోర్లు తవ్వకూడదు. అలాంటి బోర్లు గుర్తించి సీజ్‌ చేస్తాం. బోరు తవ్వాలంటే మండల రెవెన్యూ అధికారి నుంచి అనుమతులు తప్పనిసరి. భూగర్భ జలాలను కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. భవిష్యత్‌లో నీటి సమస్య రాకుండా ఉండాలంటే వాల్టా చట్టం ప్రకారం నిబంధనలు పాటించాలి. నీటి వినియోగం అవసరానికి మించి చేయరాదు.

– రాజశేఖర్‌రెడ్డి,

జిల్లా భూగర్భ జలశాఖాధికారి

భూగర్భ జలాన్ని కాపాడుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement